చోరీ కేసుల్లో నలుగురు అరెస్ట్ : ఆటోతో పాటు చోరీ సొత్తు స్వాధీనం

విశ్వంభర, రాజన్న సిరిసిల్ల జిల్లా: గంభీరావుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన రెండు చోరీ కేసులను పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన ఆటోతో పాటు చోరీ చేసిన ఇనుప సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. గంభీరావుపేట గ్రామ శివారులో వ్యవసాయ బోర్ల వద్ద అమర్చిన విద్యుత్ మోటార్ల కరెంట్ వైర్లు, లింగన్నపేట శివారులోని శ్రీ లక్ష్మీనారాయణ ఇండస్ట్రీస్ రైస్‌మిల్‌లో ఇనుప రాడ్లు, ఇతర ఇనుప సామగ్రి చోరీకి గురయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు నర్మాల గ్రామ శివారులోని అగస్త్య ఫుడ్ కంపెనీ సమీపంలో అనుమానాస్పదంగా ఆటోలో తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారు. అరెస్టైన నిందితులు దుబ్బాకకు చెందిన నూనె నర్సింహులు (43), తుర్పతి సంజీవ్ అలియాస్ సంజీవ్ (26), నూనె శ్యామల (32), నూనె నాగమణి (39). వీరు పాత ఇనుప సామగ్రి, ప్లాస్టిక్ వస్తువులు సేకరించే పేరుతో గ్రామాల్లో సంచరిస్తూ వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ వైర్లు, రైస్‌మిల్లుల్లోని ఇనుప సామగ్రిని చోరీ చేసి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి చోరీకి ఉపయోగించిన TS15UB2248 నంబర్ ఆటోతో పాటు చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పలు చోరీ కేసులతో కూడా సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.

🕒 22 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/crime/four-arrested-in-theft-cases-stolen-property-seized-along-with/article-19350

Tags:  

Advertisement

LatestNews

అనంతపురం మున్సిపల్ ఆఫీసులో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలపై ఆరోపణలు
అమరావతి సమీపంలోని మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
పటాన్‌చెరులో పాలిటెక్నిక్ విద్యార్థుల నిరసన.. శక్తి స్కీంలో విలీనం చేయొద్దంటూ ఆందోళన
భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి.. ‘భూలక్ష్మి’ పథకంపై కవిత
దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉద్రిక్తత.. లెక్చరర్‌పై ఏబీవీపీ కార్యకర్తల దాడి
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్.. వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు
చెన్నైకి సీఎం చంద్రబాబు.. సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి హాజరు