విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రదానం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగం, టిఎస్ కేసి (తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జి సెంటర్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్ అండ్ ఎఐ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ సైన్స్ ప్రాధాన్యత ఎంతో ఉన్నదని, ఉపాధి కల్పనలో కంప్యూటర్ కోర్స్ ఎంతో ఉపయోగపడుతున్నదని, కంప్యూటర్ రానివారు ఎంత విద్యావంతులైనా నిరక్షరాస్యులుగానే పరిగణించాల్సిన పరిస్ఠితి ఏర్పడిందని అన్నారు. కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యక్షులు బి.అమర్ మాట్లాడుతూ, వారం రోజుల శిక్షణా కార్యక్రమంలో ఎమ్మెస్ ఆఫీస్, ఎక్సెల్, డాటా ఎనలిటిక్స్, పవర్ బిఐ, పైథాన్ మొదలగు అంశాల పట్ల చక్కని శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్-ప్రిన్సిపల్ డాక్టర్ పి.వెంకటేశ్వర రావు, ఐక్యుఏసి కో-ఆర్డినేటర్ డాక్టర్ లక్ష్మీ నీలిమ, కంప్యూటర్ కోర్స్ శిక్షకులు జి.సంజీవులు, అధ్యాపకులు డాక్టర్ జి.సునీత, డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య, డాక్టర్ సిహెచ్.వెంకట్ గౌడ్, ఎం.అనిత, డాక్టర్ డి.కిషన్, డాక్టర్ ఎం.రవీందర్ రావు, డాక్టర్ రాచమళ్ళ శ్రీను, నరేష్, రాధిక, ఆంజనేయులు, రవి లతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.



