ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి  

ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి  

  • సూర్యాపేట  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 

 విశ్వంభర,సూర్యాపేట: త్వరలో నిర్వహించే   ఇంటర్మీడియట్, పదో  తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్, పదో  తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25  నుంచి  మార్చి 18 వరకు ఇంటర్మీడియట్..  మార్చి 14 నుంచి  ఏప్రిల్ 16 వరకు పదో  తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించబడతాయని, ఇట్టి  పరీక్షలకు సంబంధిత శాఖలు అన్ని ఏర్పాట్లు  చేయాలని సూచించారు.  విద్యాశాఖ, రెవెన్యూ, పోలీస్, వైద్య, సమాచార, పంచాయతి రాజ్, రవాణా, విద్యుత్తు, ఆర్టీసీ, ట్రెజరి, పోస్టల్,  మున్సిపల్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎటువంటి అంతరాయం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు అవసరమైన భద్రతా చర్యలు, రవాణా సౌకర్యాలు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, ప్రశ్నాపత్రాల రవాణా మరియు భద్రత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ బందోబస్తు మధ్య ప్రశ్న, జవాబు పత్రాలు డోర్ క్లోజ్డ్ వాహనాలలో మాత్రమే తరలించాలని సూచించారు. జిల్లాలో 69 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణకు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  పర్యవేక్షణకు ఫ్లైయింగ్ స్కాడ్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి అనువుగా అదనపు బస్సులు నడపాలని తెలిపారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు.  పరీక్షా కేంద్రాల్లో పారిశుద్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని పంచాయతి, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, డిఈఓ అశోక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి భాను నాయక్, డిపిఓ యాదగిరి, పోలీస్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: