అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ధర్నా‌

అక్రమ కట్టడాలు కూల్చివేయాలని ధర్నా‌

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకొని అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సముద్రాల నగేష్ ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా‌ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో సుజాత, ఎమ్మార్వో విజయలక్ష్మి లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ అండదండలతో పోలీస్ కోటర్స్ వెళ్లే దారిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ,వీరికి సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులపై మండిపడ్డారు. ఎంపీడీవో, ఎమ్మార్వో అధికారులు వెంటనే స్పందించి ఇండ్ల నిర్మాణాలు నిలిపివేయాలని లేని ఎడల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శివర్ల రమేష్, కుకడపు రామకృష్ణ, వెన్నం శేఖర్, మాసని సైదులు, జక్కుల రమేష్, బోడ్డు మహేష్, మోర వెంకటరమణ, సోమరాజు ప్రదీప్, గజ్జె అభినవ్, కుందేళ్ళ శ్రీశైలం, గడ్డి మహేందర్, కోప్పుల వెంకటేష్, కడారి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Tags: