''బీజేపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం''

''బీజేపీ నేతల అరెస్టు అప్రజాస్వామికం''

విశ్వంభర,ఇనుగుర్తి: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతోపాటు పలువురు నాయకులను అరెస్టు చేయడం, నిర్బంధించడం అప్రజాస్వామికమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీజేపీ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు కట్టుకొని సోమవారం నిరసన తెలిపారు. కామారెడ్డి ఘటనను సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక అక్రమ అరెస్టులు కేసులు బనాయిస్తూ అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. పోలీసులను ఉసిగొలుపుతూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని బెదిరింపులకు పాల్పడితే భవిష్యత్తులో తగిన మూల్యం ల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ తిరగబడితే పరిస్థితి వేరే తీరుగా  ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం వంటిదని, ఎన్నో రాష్ట్రాలలో ఓడిపోయి చతికలబడిపోయినప్పటికీ రాష్ట్రంలో బరితెగించి వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా మండల నాయకులు పొదిల నరసింహారెడ్డి, సందీప్,వెంకటేశ్వర్లు కుల్ల వెంకన్న,మునిగంటి యాకయ్య,భోగ అనిల్,వల్లముల రాజేందర్,గండి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: