మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట

మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట

  • మంత్రి వర్గంలోనూ ఇద్దరు మహిళా మంత్రులు
  • జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్

 విశ్వంభర, ఖమ్మం : కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా పక్షపాతి ప్రభుత్వం అని ప్రభుత్వ అన్ని పథకాలకు మహిళా పేరు మీదనే అమలు జరుగుతుంటాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ అన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.... మహిళా దినోత్సం అని చాలా సామాన్యంగా అనే ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది అని అన్నారు.వాస్తవానికి ఇది 'అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం'. కాలక్రమంలో ఇది మహిళా దినోత్సవంగా పిలువబడుతుంది అని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,  సహచర మంత్రి వర్గ సభ్యుల సహకారంతో ప్రభుత్వ పథకాలను ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరుతో మంజూరి,మహిళలను మహారాణులను చేయాలని ప్రజాపాలన గావిస్తున్న ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేసే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూప్ లకు వడ్డీ లేని రుణాలు, బస్సుల కొనుగోలు చేయించి వాటిని ఆర్ టి సి  అద్దెకితీసుకోవటం తద్వారా మహిళా ఆర్థిక  స్వావలంబనకు కృషి చేస్తున్నామని అదే విధంగా మహిళలకు ఆర్ టి సి బస్ లలో ఉచిత ప్రయాణం, గాస్ సబ్సిడీ అనేక మహిళాభివృద్ధి పథకాలు చేపడుతున్నామని అన్నారు.అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి,మహిళామణులకు సన్మానం చేసినారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా అనుబంధ సంఘ అధ్యక్షులు కొత్తా సీతారాములు, సయ్యద్ గౌస్,పుచ్చకాయల వీరభద్రం, జిల్లా ఆర్ టి ఏ మెంబర్ గజ్జెల్లి వెంకన్న,కార్పొరేటర్లు రపేదా బేగం, మిక్కిలినేని మంజుల నరేంద్ర, తోట ఉమారాణి,రుద్రగాని శ్రీదేవి,బిక్కసాని స్వరూప,భార్గవి, దివ్య,చంద్రిక, సుగుణ,గోవిందమ్మ,రమాదేవి, జ్యోతి, మంగ, పుష్ప తదితర నాయకులు పాల్గొన్నారు.

Tags: