వీధి దీపాలు ఏర్పాటు
On
విశ్వంభర, పరిగి: మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 8వ వార్డు కౌన్సిలర్ అభి బున్నీసా అయూబ్, కిష్టమ్మ గుడి తండా, శ్రీనివాస్ కాలనీ, తుంకుల్ గడ్డ, లో వీధి దీపాలు వేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సాధిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డే ఆంజనేయులు, శ్రీనివాస్, కాశిఫ్, ముజమిన్, వడ్డే రాజు, అబ్దుల్ యూసఫ్, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.



