మహిళా కానిస్టేబుళ్లను సత్కరించిన అడిషనల్ డీసీపీ

మహిళా కానిస్టేబుళ్లను సత్కరించిన అడిషనల్ డీసీపీ

విశ్వంభర, ఖమ్మం : సమాజ భద్రత, చట్ట పరిరక్షణలో మహిళా పోలీసుల పాత్ర అభినందనీయమని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) రామానుజం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ లోని మహిళా పోలీస్ కానిస్టేబుల్స్,అధికారుల సేవలను గుర్తించి, వారి ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. శాలువాలు, జ్ఞాపికలతో అడిషనల్ డీసీపీ ఘనంగా సత్కరించారు. పోలీస్ శాఖలో మహిళల భాగస్వామ్యాన్ని, వారి అంకితభావాన్ని ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. పోలీస్ శాఖలో మహిళా సిబ్బంది సేవలు అద్భుతంగా ఉన్నాయని, అన్ని కేసుల్లో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ.. ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసి భార్యాభర్తలను ఒక్కటి చేస్తున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు.

Tags: