నానో యూరియా వాడాలి.. వరి కొయ్యలు కాల్చొద్దు
- కలెక్టర్ స్నేహ శబరిష్
విశ్వంభర, మహబూబాబాద్: రైతులు పంట మార్పిడి విధానం పాటిస్తూ నానో యూరియా, సేంద్రియ ఎరువులు వినియోగించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గుమ్మడూరులో నిర్మాణంలో ఉన్న రెండు పడకల గదుల ఇళ్లను పరిశీలించిన అనంతరం, పెద్దవంగర మండలం ఉప్పరిగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్ గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు భూసార పరీక్షలు చేయించుకుని ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యంతో పాటు భూమి సారవంతత దెబ్బతింటుందని హెచ్చరించారు. అలాంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల సమస్యలు స్వీకరిస్తున్నామని తెలిపారు. పెన్షన్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి అంశాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గ్రామసభలో ప్రజలు, సర్పంచ్ సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వేణుమాధవ్, తహసీల్దార్ వినోద్ కుమార్, వివిధ శాఖల అధికారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.