ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: ఏఈఓ బాలాజీ
విశ్వంబర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి, జంగిలిగొండ, విఎస్ లక్ష్మీపురం, సింగారం గ్రామాలలో ఉన్న రైతులందరూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఏఈ ఓ బాలాజీ రైతులకి పిలుపునిచ్చారు . ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ అనేది కేంద్ర ప్రభుత్వం పథకాలు అమలకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం ఉంటుందని అన్నారు. పీఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత పొందుటకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు తప్పనిసరి అని అన్నారు. ఈ ఫార్మర్ రిజిస్ట్ చేసుకోవడానికి ఎవరైతే వ్యవసాయ భూమి ఓనర్ ఉంటారో రైతు యొక్క ఆధార్ కార్డు, రైతు పట్టా పాస్ బుక్, ఆధార్కు లింకె చేసిన మొబైల్ నెంబర్, లతో నమోదు చేసుకోవాలని రైతులను కోరారు . అనంతరం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న బువజమాన్య రికార్డుల ఆధారంగా మాత్రమే నమోదు అవుతాయని అన్నారు. రైతు రిజిస్ట్రీ అనేది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేవి ఫార్మర్ రిజిస్ట్రీ తో ఎలాంటి సంబంధం లేదని, రైతు రిజిస్ట్రీ నమోదు చేసుకోవడానికి చివరి తేదీ ఈనెల 28వ తేదీ వరకు అని అన్నారు.



