పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి 

  • కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్  

 విశ్వంభర, సూర్యాపేట: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డుల్లో నిర్వహించిన పరిశుభ్రత కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్,  మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత, మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, కౌన్సిలర్ అరుణ  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా   జిల్లా కలెక్టర్ పారిశుధ్య కార్మికులతో కలిసి  చెత్త తొలగింపు కార్యక్రమంలో పాల్గొని శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తలను వేరు చేసి మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు క్రమం తప్పకుండా  ఇవ్వాలని ప్రజలకు సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ సిబ్బందికి ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వార్డుల్లో పర్యటించి కాలనీల్లో చెత్త తొలగింపు, డ్రైనేజీల శుభ్రపరచడం, రోడ్లను శుభ్రంగా ఉంచడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా మరియు అందంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రజలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: