తొలగిన అడ్డుగోడ.. తగ్గిన దూరం

తొలగిన అడ్డుగోడ.. తగ్గిన దూరం

విశ్వంభర, హైదరాబాదు : మల్లంపేటలో రహదారికి అడ్డంగా ప్రణీత్ ఆంటిల్యా నిర్మించిన ప్రహరీని హైడ్రా సోమవారం తొలగించింది. దీంతో స్థానికులకు 5 కిలోమీటర్ల అదనపు ప్రయాణ భారం తప్పి, ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా వెళ్లే మార్గం ఏర్పడింది. రహదారి మూసివేతపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా నిర్వాహకులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం హైకోర్టు మార్గదర్శకాల మేరకు అది గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించి రహదారికి అడ్డంగా ఉన్న ప్రహరీని తొలగించింది. ఇప్పటి వరకు ఈ మార్గంలో వెళ్లేందుకు 8 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చేది. ప్రహరీ తొలగించడంతో ఆ దూరం 3 కిలోమీటర్లకు తగ్గింది. దీంతో మల్లంపేట, బాచుపల్లి ప్రాంతాల ప్రజలకు ప్రయాణం సులభమైంది.

Tags: