శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పోస్టర్ విడుదల
On
విశ్వంభర, చత్రినాక : చంద్రాయన గుట్ట నియోజకవర్గంలో ఛత్రినాకలో ప్రసిద్ధిగాంచిన శ్రీశ్రీశ్రీ లక్ష్మనేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 27వ తారీఖు నాడు నిర్వహించబోయే శ్రీరామనవమి, శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుకల ఆహ్వాన పోస్టర్ను చంద్రాయన గుట్ట కాంగ్రెస్ ఇంచార్జ్ బోయ నగేష్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బోయ నగేష్ మాట్లాడుతూ, నియోజకవర్గంలోని భక్తులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించగలరు అని తెలుపుకొచ్చారు . ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దామోదర్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



