కార్యకర్తలకు అధిక రుణాలివ్వాలి

కార్యకర్తలకు అధిక రుణాలివ్వాలి

విశ్వంభర, సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీలోని దళిత కార్యకర్తలకు అత్యధికంగా కార్పొరేషన్ రుణాలిచ్చి ఆదుకోవాలని ఆ పార్టీ చిన్నకోడూరు మండల అధ్యక్షుడు మీసం మహేందర్ యాదవ్ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ నగరిగారి ప్రీతమ్ ను కోరారు. హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ లోని కార్పొరేషన్ కార్యాలయంలో టీపీసీసీ సెక్రటరీ దేవులపల్లి యాదగిరి, సిద్దిపేట కౌన్సిలర్ సాకి ఆనంద్ తో కలిసి సోమవారం ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చిన్నకోడూరు, నంగునూర్ మండలాలకు చెందిన నిరుద్యోగ దళితులకు నిధులిచ్చి ఉపాధి కల్పించి ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా  కార్పొరేషన్ ఛైర్మన్ ప్రీతమ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం దళితుల నిధులు ఇతర పనులకు వాడుకుని వారికి తీరని అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండి, దశబ్దాలుగా పనిచేస్తూ పార్టీకి విధేయులుగా, నిస్వార్థంగా ఉన్న దళిత యువకులకు వచ్చే బడ్జెట్ లో అత్యధికంగా రుణాలిచ్చి ఆదుకుంటానని హామీనిచ్చారు. కార్యక్రమంలో నంగునూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బాగు శ్రీకాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags: