కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి: కేఎల్ఆర్
విశ్వంభర, మహేశ్వరం: వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీహెచ్ఎంసి ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులకు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. తుక్కుగూడ కార్యాలయంలో ప్రచార రథాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ సర్పంచ్, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం జోడు గుర్రాల్లా పరుగెడుతున్నాయని కొనియాడారు. భవిష్యత్తులో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, జీ హెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం, ప్రచార రథాలను మహేశ్వరం , కందుకూరు మండలాలకు పంపారు. ఈ సందర్భంగా ప్రచార కమిటీ కో ఆర్డినేటర్స్ ను కె ఎల్ ఆర్ నియమించారు. మహేశ్వరం మండలం రాజు నాయక్, శివ నర్కుడ, రాఘవేందర్ రెడ్డి, కందుకూరు మండలం సరికొండ మల్లేష్, విష్ణువర్ధన్ రెడ్డి, ఢిల్లీ శ్రీధర్, గాదె కుమార్ ను కో ఆర్డినేటర్స్ గా నియమించారు.



