కవితకు చీర బహూకరణ
On
విశ్వంభర, హైదరాబాదు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను హరిబౌలి డివిజన్ నాయకులు కలిసి చీరను బహూకరించారు. మహిళల సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాలలో ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధిలో వారి పాత్ర మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హరిబౌలి డివిజన్‌కు చెందిన రాకేష్ గైక్వాడ్ (సోనూ భాయ్), కఠినం ఆస్థానా, శ్రీకర్ శర్మ, రాజు కుమార్, ఓంకార్ స్వామి, నిలయ్ భూషణ్ రాయ్ ఆస్థానా, నితిన్, నవీన్, రూప్ సింగ్, సచిన్, శశి, పల్లవి, ముఖేష్, రాహుల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



