మిలియన్ మార్చ్‌ డే ను విజయవంతం చేయండి

మిలియన్ మార్చ్‌ డే ను విజయవంతం చేయండి

విశ్వంభర, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచిన మిలియన్ మార్చ్‌ డే ను విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంయుక్త కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు, సంయుక్త కార్యాచరణ కమిటీ అధికార ప్రతినిధి కంచర్ల బద్రి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంయుక్త కార్యాచరణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల ప్రపూల్ రామరెడ్డి మాట్లాడుతూ నేటి మిలియన్ మార్చ్ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటేలా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. “చలో గన్ పార్క్” అంటూ ప్రజలను ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మీడియా పాయింట్ వద్ద మిలియన్ మార్చ్ డే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు జాజుల లింగం గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు మాతంగి ఓదెలు, ఉద్యమ కళాకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు పెద్ద యాదగిరి, తెలంగాణ మహిళా జేఏసీ నాయకులు లక్ష్మి, సుజై, రాణి, ఎఐఎస్ఎఫ్ నాయకులు ఉదయ్, పుట్టా రంజిత్, కళాకారులు కిరణ్, రాజేష్, వీరేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ నేడు గన్ పార్క్ వద్ద జరిగే కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.

Tags: