మాజీ సర్పంచ్ రాజమౌళి మృతికి సంతాపం
On
విశ్వంభర, మహబూబాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ గంగదేవిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూసం రాజమౌళి అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం మృతి చెందడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర మాజీ నాయకులు, తెలంగాణ మున్సిపల్ సెంట్రల్ ఫోరం మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి సింగు రమేష్ ఒక పత్రికా ప్రకటనలో తన సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన సంతాప సందేశంలో మాట్లాడుతూ, జాతీయస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీగా గంగాదేవి పల్లిని ఎంపిక కావడంలో, గ్రామ సర్పంచిగా ఆయన కృషి చాలా అత్యంత కీలకమన్నారు . ఆయన మృతి పట్ల తన సంతాపాన్ని ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు .



