మెగా హెల్త్ క్యాంపునకు అనూహ్య స్పందన
- 269 మందికి స్పెషలిస్ట్ వైద్యులచే వైద్య పరీక్షలు
విశ్వంభర, ఇనుగుర్తి: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా మండల కేంద్రం ఇనుగుర్తి పీహెచ్సీలో మెడికల్ ఆఫీసర్ డా.డి.సురేష్ పర్యవేక్షణలో సోమవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు అనూహ్యస్పందన లభించింది. ఆరోగ్య శిబిరాన్ని స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్,ఎంపీడీవో బండారు పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రత్యేక విభాగాల వైద్యులచే క్యాంపు నిర్వహించడంతో వివిధ డిసీజ్ లకు చెందిన ప్రజలకు ఉపయోగకరమన్నారు. అనంతరం డా.సురేష్ వివరాలు తెలుపుతూ పలు రుగ్మతులకు చెందిన 269 మందికి స్పెషలిస్టులయిన డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్నవారికి మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోగులకు వైద్యులు పలు సూచనలు చేశారన్నారు.కార్యక్రమంలో వైద్యులు దీప్తి శ్రీనాథ్ నవీన్ శ్రీకాంత్ రాజకుమార్ స్థానిక వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



