జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం
- ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల పాత్ర కీలకం
- టిపిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్
విశ్వంభర, నిజామాబాద్: జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కలెక్టర్ అధికారులతో ప్రత్యేక సమావేశమై త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజాస్వా మ్య వ్యవస్థలో పాత్రికే యుల పాత్ర అత్యంత కీలకమని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు . పత్రికా రంగానికి ఎంతో ప్రత్యేక ప్రాధాన్యత ఉంద ని అన్నారు. ప్రజా సమ స్యలను ప్రభు త్వానికి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లే వారధి మీడియా నేనని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జర్నలిస్టులకు ఎల్లప్పుడూ అండగా ఉం టానని జర్నలిస్టుల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. సోమ వారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్ లో ప్రెస్ క్లబ్ నూత న కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగ రంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహో త్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు బోమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ , రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ,అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహే ర్ బిన్ హుందా న్,నగర మేయర్ కూరగాయల ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పాగంగారెడ్డి, వేలే నెస్ ఆస్పత్రి ఎండీ అసద్ ఖాన్, వెల్నెస్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ వెంకట్ రెడ్డి రాజకీ య నాయకులు ప్రముఖులు ము ఖ్య అతి థులుగా హాజ రయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ నూతన కార్యవర్గం ముఖ్య అతిథు లను శాలువాతో ఘనంగా సన్మానించారు.



