ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో స్టైఫండ్ దోపిడీ అరికట్టాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : తెలంగాణలో ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన స్టైఫండ్ దోపిడీని అరికట్టాలని హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి డి. కిరణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రైవేట్ మెడికల్ కళాశాలలు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థులకు స్టైఫండ్ చెల్లించకుండా ఆర్థిక, మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని బకాయి స్టైఫండ్లను చెల్లింపజేయడంతో పాటు నిబంధనలు ఉల్లంఘిస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో టి. సాగర్, ఆర్. శ్రీరామ్ నాయక్, జె. వెంకటేష్, ఎం. శ్రీనివాస్, ఎ. విజయ్ కుమార్, కోట రమేష్, వెంకటేష్, పి. మహేష్, కె. అశోక్ రెడ్డి, జె. రమేష్, లెనిన్, నాగేందర్ పాల్గొన్నారు.



