గంజాయి, డ్రగ్స్‌పై ప్రత్యేక దాడులు
విశ్వంభర, హైదరాబాదు : తెలంగాణలో గంజాయి, డ్రగ్స్‌తో పాటు నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్ విక్రయాలను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దాడులు చేపడుతోంది. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అదనపు తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డ్రగ్స్, గంజాయి విక్రయాలు జరుగుతున్న హాట్ స్పాట్స్‌గా ధూళిపేట్, నారాయణగూడ, ఫతేనగర్, సీతాఫల్‌మండి, నేరేడ్‌మెట్, షేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మూసాపేట్, దిల్‌సుక్‌నగర్, ఎల్‌బీనగర్, ఉప్పల్, నాగోల్ ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచారు. అలాగే చెక్‌పోస్టులు, రైళ్లు, విమానాశ్రయాల్లో కూడా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు 2025లో నిర్వహించిన దాడుల్లో భారీగా గంజాయి, నాన్ డ్యూటి పెయిడ్ లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌డీపీఎల్ మద్యం, డ్రగ్స్ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా దాడులను మరింత ముమ్మరం చేసి గంజాయి, డ్రగ్స్, అక్రమ మద్యం రవాణాను పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.



