ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
విశ్వంభర, అంబర్ పేట : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లాయర్ మల్లన్న మాదిగ తెలిపారు. మాదిగ ఆటో డ్రైవర్స్ హైదరాబాదు యూనియన్ ఆధ్వర్యంలో అంబర్ పేటలో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా బోయ వెంకట రమణ మాదిగ మాట్లాడుతూ అద్దె ఇళ్లలో నివసిస్తున్న ఆటో డ్రైవర్లను గుర్తించి డబుల్ బెడ్‌రూమ్ పథకంలో ఇళ్లు కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాల ద్వారా మాదిగ ఆటో డ్రైవర్లకు ఆటోలు అందించాలని కోరారు. త్వరలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాదిగ ఆటో డ్రైవర్స్ హైదరాబాదు యూనియన్ ఆడహాక్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా జావీదు నర్సింగ్ రావు, ఉపాధ్యక్షుడిగా సి.హెచ్. ప్రభు, ప్రధాన కార్యదర్శిగా ముత్యాల మురళి ఎన్నికయ్యారు. ఇతర నాయకులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.



