మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మైనారిటీ పాఠశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా  బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను  నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి  సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతుల గురించి ఆరా తీశారు. ​అనంతరం వంటగదిని, స్టోర్ రూమ్‌ను పరిశీలించి నిల్వ ఉన్న సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని, పారిశుధ్యం విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Tags: