ఎఫ్.పి.ఓ సభ్యత్వ స్వీకరణ   

ఎఫ్.పి.ఓ సభ్యత్వ స్వీకరణ   

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం  ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఎఫ్.పి.ఓ సభ్యత్వ స్వీకరణ, అవగాహన సదస్సులో గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ పాల్గొని  గ్రామంలో మొట్టమొదటి సభ్యత్వం స్వీకరించారు. సభ్యత్వాల గురించి రైతులకు ఉన్న సందేహాలు తొలగించాలని చెప్పారు. గ్రామంలో నిరుపయోగంగా ఉన్న ప్రాధమిక సహకార సంఘము భవనాన్ని ఎరువుల కోసం ఉపయోగించుకోవాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, సిఈవో జంగారెడ్డి, సిబ్బంది, రైతులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags: