అనారోగ్యంతో బాధపడుతున్న శివకృష్ణ కు ఆర్థిక సహాయం అందజేసిన గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి
On
విశ్వంభర, బాబుల్ రెడ్డి నగర్:- నిరుపేద కుటుంబానికి చెందిన శివకృష్ణ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూనాడు. సమాచారం తెలుసుకున్న గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మానవతా దృక్పథంతో చేరదీసి తక్షణం వైద్యం కోసం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గుర్రాల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నీకు ఆ భగవంతుడు నేను అండగా ఉంటా మెరుగైన వైద్యం కోసం ఎప్పుడైనా నన్ను సంప్రదిస్తే నా చేతనైన సహాయం చేయడానికి నేను ఉన్నానని అతనికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణు సేవా సమితి సభ్యులు రుద్రారం మాజీ సర్పంచ్ బండ స్వర్ణలత సతీష్ కుమార్, కావలి రమేష్, కావలి మాణిక్యం, మల్ గారి భీమ్ రెడ్డి, చెవిటి రవి, బండి దయాకర్, బీసీ సేన షాబాద్ మండల యువజన విభాగం అధ్యక్షుడు బండ అజేయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



