77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన సామాజిక కార్యకర్త
విశ్వంభర, హైదరాబాద్ :- 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ నగర్‌కు చెందిన మాదగోని శోభకు అత్యవసరంగా రక్తం అందించి సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ ప్రశంసలందుకున్నారు.అభినవ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో రక్తహీనతతో బాధపడుతున్న మాదగోని శోభకు హిమోగ్లోబిన్ స్థాయి కేవలం 5 శాతం మాత్రమే ఉండటంతో వైద్యులు తక్షణమే 20 యూనిట్ల రక్తం అవసరమని సూచించారు. ఈ విషయమై మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు చేపూరి శంకర్, డాక్టర్ వేణుగోపాల్ పాలకుర్తితో సంప్రదించగా అత్యవసర రక్త అవసరం ఏర్పడింది.దీనికి స్పందించిన సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ వెంటనే రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ నుంచి ఉచితంగా రక్తాన్ని అందించి బాధితురాలి ప్రాణాలను కాపాడారు.ఆపత్కాల సమయంలో రక్తం అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి పరిస్థితులు రాకుండా తలసేమియా బాధితుల కోసం తమ సొసైటీ నిరంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తూ అనేక మంది ప్రాణాలను కాపాడుతోందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదగోని శోభ, శ్రీనివాస్, వైద్య బృందం తదితరులు పాల్గొన్నారు.



