భక్తి భావం సమాజానికి చక్కటి మార్గం
- భక్తి భావం సమాజానికి చక్కటి మార్గం
విశ్వంభర, సిద్దిపేట: ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే యువత సంస్కృతి, సంప్రదాయాలకు అలవాటు పడుతారని యువ నాయకుడు వంగ రాజేశ్వర్ రెడ్డి అన్నారు. భక్తి భావం సమాజానికి చక్కటి మార్గాన్ని చూపిస్తుందని తెలిపారు. చిన్నకోడూరు మండలం అల్లీపూర్ గ్రామంలో వైభవంగా నిర్వహించిన శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవానికి శుక్రవారం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులు, హనుమాన్ స్వాములు రాజేశ్వర్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. కాగా కత్తెర రమేశ్ రెడ్డి నివాసంలోని హనుమాన్ స్వామి భిక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పెద్దకోడూరు గ్రామంలోని ప్రసిద్ధ రంగనాయక సాగర్ అభయాంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. హనుమాన్ స్వాములతో కలిసి భిక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘డబుల్ బ్యారెల్’మూవీ పోస్టర్‌ను వంగ రాజేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. యువ శక్తిని ప్రోత్సహించడంలో ముందుంటానని చెప్పారు. కార్యక్రమంలో మూవీ దర్శక నిర్మాతలు, నటులు పాల్గొన్నారు.