రవీంద్ర భారతిలో ఘనంగా పుస్తక ఆవిష్కరణల సభ
On
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ సాహిత్య అకాడమీ , విశాల సాహిత్య అకాడమీ , తెలంగాణ బాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో పుస్తకావిష్కరణల కార్యక్రమం రవీంద్ర భారతిలోని మినీ హల్ లో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి సభాధ్యక్షతన కార్యక్రమం జరిగింది. పుస్తక ఆవిష్కరణల సభ ద్వారా బిట్ల నారాయణ నా అంతరంగ తరంగాలు శాత జయంతి సందర్బంగా స్వీయ చరిత్ర రీప్రింట్ చేసి తెలంగాణ పద్మశాలి సంఘం వైస్ చైర్మన్ , బీసీ నాయకులు కర్నాటి మనోహర్ ఆవిష్కర్తగా వ్యవహరించారు. అలాగే మార్గదర్శి బిఎస్ రాములు 75 యేళ్ళ జీవిత ప్రస్థానం పై గ్రంథ కర్త కరీం వ్యవహరించగా , సిద్ధిపేట జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు , డా. కస్తూరి సతీష్ కుమార్ పుస్తకం ఆవిష్కరణ చేశారు. హిస్సా , ఇజ్జత్ హుకుమత్ బీసీ రాజ్యాధికార సిద్ధాంతం పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ టి . చిరంజీవులు బీసీ రాజ్యాధికార సిద్ధాంతం పుస్తక పరిచయం చేయడం జరిగింది. ఈ పుస్తకావిష్కర్త ప్రముఖ కధా రచయిత తత్వవేత్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ బిఎస్ రాములు ఆవిషకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి నామోజు బాలాచారి, ప్రముఖ చరిత్రకారుడు పరిశోధకులు డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీత రాములు , పంజాల జైహింద్ గౌడ్, ప్రజాకవి జయరాజు, ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర, ప్రముఖ రచయిత్రి జాజుల గౌరీ, అడ్వకేట్ వనం దుష్యంతల ,కర్నాటి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.



