రామన్నపేటలో మోదీ దిష్టిబొమ్మ దగ్ధం
విశ్వంభర, రామన్నపేట: రామన్నపేట మండల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్టె సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నకిరేకల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నల్లగొండ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మేకల ప్రమోద్ రెడ్డి, నకిరేకల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగు రఘుమారెడ్డి పాల్గొన్నారు. అనంతరం రామన్నపేట పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్‌లో యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉదయ్ భాను అక్రమ అరెస్టుని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు . ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ జాల మణికంఠ, నకిరేకల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ముజాహిద్, నార్కెట్పల్లి మండల అధ్యక్షుడు జిల్లా పృథ్వీరాజ్, రామన్నపేట మాజీ యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, రామన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కల్లూరి శివ, కేస సాయి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేకల జలంధర్, యువజన కాంగ్రెస్ నాయకులు రుద్రాల విక్కి, వేణు, మొహమ్మద్ జానీ తదితరులు పాల్గొన్నారు.



