యుద్ధ వ్యతిరేక ర్యాలీకి పిలుపు
On
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదులో ఈ నెల 29న చార్మినార్ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు జరిగే యుద్ధ వ్యతిరేక ప్రజాకార్మిక ప్రదర్శనను జయప్రదం చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చాయి. హైదరాబాదు ముషీరాబాదు సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్రాజ్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, అమెరికా, ఇజ్రాయిల్ చర్యలను విమర్శిస్తూ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్డి చంద్రశేఖర్, కె.యాదగిరి, జే.వెంకటేష్, ఎం.దశరథ్, జె.కుమారస్వామి, ప్రదీప్, మారయ్య, మీనా, శ్రావణ్, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.



