భగత్ సింగ్ కు ఘనంగా  నివాళులు 

భగత్ సింగ్ కు ఘనంగా  నివాళులు 

విశ్వంభర, మహబూబ్ నగర్:  భగత్ సింగ్, శుఖదేవ్, రాజ్ గురు  95వ, వర్ధంతి సందర్భంగా వారి అమరత్వాన్ని స్మరించుకుంటూ భగత్ సింగ్ విగ్రహం వద్ద  ప్రజా సంఘాలు సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టి ఎఫ్ టీ యూ, డి టీ ఎఫ్, టి పి ఎఫ్, పాలమూరు అధ్యయన వేదిక,  చైతన్య మహిళా సంఘం, ఇమాన్ కమిటీ తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆనాటి భగత్ సింగ్ సామ్రాజ్య వాద దురహంకారం ఏ విధంగా దేశాలను కబళిస్తుందో ప్రస్తుతం పరిస్థితి అదే విధంగా ఉంది అని దేశంలో జరుగుతున్నటువంటి అనేక ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, యుద్ధానికి వ్యతిరేకంగా మనందరం కూడా ఉద్యమించాలని  అదే నిజమైన నివాళి అని ప్రముఖులు పేర్కొన్నారు.

Tags: