చలివేంద్ర ను ఏర్పాటు చేసిన సామాజికవేత్త గద్దె విజయ్ నేత
విశ్వంభర, బీ ఎన్ రెడ్డి నగర్ :- డివిజన్ లోని బిఎన్.రెడ్డి నగర్ ఆటో స్టాండ్ వద్ద ప్రముఖ సామాజిక వేత్త, మల్కాజ్ గిరి అడ్ హాక్ కమిటీ మెంబర్, బీ ఎన్ రెడ్డి నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత ఆధ్వర్యంలో ప్రజల దాహర్తిని తీర్చడానికి రెండవ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.కీర్తిశేషులు జీవి చలపతిరావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.గత 20 సంవత్సరాలుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అబాగ్యులకు, నిరుపేదలకు, వృద్దులకు, అనాధలకు ఎంతో సేవా చేసుకొని ముందుకు సాగుతున్న గద్దె విజయ్ నేతను పలువురు ప్రశంసించారు. జీవి శ్రీదేవి చేతుల మీదుగా మజ్జిగతో కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు *వెంకటేశ్వరరావు, అశోక్, వెంకట్, చల్ల రవి చౌదరి, కిషోర్, మనోజ్ చౌదరి, జైసింహ గౌడ్, నాగరాజు, బి.యన్.రెడ్డి ఆటో యూనియన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



