ఆస్తి పన్ను బకాయిలు వెంటనే చెల్లించండి
:కమిషనర్ ఆర్ వి కర్ణన్
విశ్వంభర, జీహెచ్ఎంసీ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న గృహ యజమానులు ఆస్తి పన్ను బకాయిలు తక్షణమే చెల్లించి వడ్డీపై 90 శాతం రాయితీ పొందాలని కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2025-26 సంవత్సరంనకు రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలు ఈ నెల 31 వ తేదీలోగా చెల్లించే వారికి ఓటీఎస్ పథకం కింద వడ్డీపై 90 శాతం రాయితీ ఇస్తుందన్నారు. ఆస్తిపన్ను బకాయిలు ఆన్లైన్ లో మాత్రమే స్వీకరిస్తామని కమిషనర్ తెలిపారు. ఆన్లైన్ వేదికలైన www ghmc.gov.in పోర్టల్, MyCURE యాప్, మీ సేవ కేంద్రాలు, సిటిజన్ సర్వీస్ సెంటర్ లలో తక్షణమే చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించి తద్వారా నగరాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఆస్తి పన్ను మొండి బకాయిదారుల పై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషనర్ స్పష్టం చేశారు.



