ఈ నెల 17 న చేనేత వస్త్ర ప్రదర్శన. - గుంటక రూప సదాశివ్
On
విశ్వంభర, హైదరాబాద్ :- వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ , తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం సంయుక్తంగా నిర్వహిస్తున్న చేనేత వస్త్ర ప్రదర్శన ఈ నెల 17,18,19 వ తేదీలలో నారాయణగూడలోని రాజ్ మొహల్లా పద్మశాలి భవన్ లో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటక రూప సదాశివ్ పత్రిక సమావేశంలో తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధిని కల్పించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనలో నేరుగా చేనేత కార్మికుడి నుండి వినియోగదారులకు అందించే విధంగా అమ్మకాలు జరిగేటట్టు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా మంచి నాణ్యమైన గల చీరలను వినియోగదారులకు అందించే విధంగా ఇలాంటి ప్రదర్శన చేపడుతున్నామని అన్నారు. దాదాపు 45 స్టాల్ల్స్ పైగా ఏర్పాటు చేయడంతో పాటు మహారాష్ట్ర , కర్ణాటక , తమిళనాడు , కేరళ ,గుజరాత్ , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని గద్వాల , పోచంపల్లి , పుట్టపాక , సిరిసిల్ల , సిద్ధిపేట , వరంగల్ , నారాయణపేట వంటి ప్రాంతాల నుండి చేనేత ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంటాయని అన్నారు. గత రెండు సం.రాలుగా చేపడుతున్న చేనేత వస్త్ర ప్రదర్శనకు మంచి పేరు రావడంతో పాటు మార్కెటింగ్ అలాగే మంచి ఆదాయం వ్యాపారస్తులకు రావడం చాల సంతోషముగా ఉందని అన్నారు. ఈ మూడవ సంవత్సరంలో కూడా చేనేత వస్త్ర ప్రదర్శన ను విజయవంతం చేయాలనీ కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు పోరండ్ల శారదా, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి మాచర్ల రామచంద్రం, ఉపాధ్యక్షులు గుర్రం శ్రావణ్ నేత, టి.పి.పి.ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చినకోట్ల స్వప్న రాజ్, కోశాధికారి నోముల రేఖ, అడెపు శాంతి, అర్చన, స్వరూప, ఉపాధ్యక్షులు విజయ, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు కత్తులు సుదర్శన్, పద్మశాలి సంఘం ఎల్.బి.నగర్ సర్కిల్ యువజన విభాగం అధ్యక్షులు కర్నాటి విజయ్ నేత తదితరులు పాల్గొన్నారు
🕒 15 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/handloom-cloth-show-on-17th-of-this-month/article-18657