-వ్యక్తిగత పరిశుభ్రత..పరిసరాల పరిశుభ్రతతోనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు

WhatsApp Image 2024-07-19 at 15.51.04_98ba7bf0

విశ్వంభర భూపాలపల్లి జూలై 19 : - వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని భూపాలపల్లి జిల్లా  మొగుళ్లపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట గ్రామంలో డాక్టర్ పోరండ్ల నాగరాణి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు తగు సూచనలను అందించారు. అనంతరం ఆమె మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత..చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యర్దాల సంక్రమణ నిర్వహణ, సురక్షిత త్రాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుకోకపోతే సీజనల్ వ్యాధుల బారిన పడక తప్పదన్నారు. ముఖ్యంగా వర్షాకాలం ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండి..మీ చుట్టూ పరిసర ప్రాంతాలలో నీటిని నిల్వ ఉంచకుండా చూసుకుంటే దోమల బెడద నుండి తప్పించుకొని సీజనల్ వ్యాధులు సోకకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఆస్కారం ఉంటుందన్నారు. నీటి ద్వారా వచ్చే వ్యాధులను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శ్వాసకోస ఇన్ఫెక్షన్లు అధికంగా వచ్చే ప్రమాదం ఉన్నందున ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లొద్దన్నారు. ఫంగస్ ఇన్ఫెక్షన్ నివారణ కోసం కాచి వడబోసిన నీటిని మాత్రమే త్రాగాలని, అలాగే చిన్నపిల్లల పట్ల, వారికి వచ్చే జ్వరాల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్నపాటి జ్వరం వచ్చిన ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ..గ్రామంలోని కాల్వలలో, ఖాళీ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయకుండా ఉండాలన్నారు. అదే విధంగా ఇంటి చుట్టూ డ్రమ్ములు, కొబ్బరి చిప్పలు, పాత టైర్లు, కొబ్బరి బొండాలు, పాత కుండలు లాంటి వాటిలో నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిని తీసేసి దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాల

Read More మహాపడిపూజ మహోత్సవంలో చిమ్ముల గోవర్ధన్ రెడ్డి