బి.సి ‘ఏ’ హక్కులు కాపాడాలి: బాగయ్య డిమాండ్
విశ్వంభర, హైదరాబాదు : బి.సి ‘ఏ’ కులాలు ఇప్పటికే తీవ్ర వెనుకబాటుతనంలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త కులాలను చేర్చితే మాకు ఉన్న స్వల్ప అవకాశాలు కూడా కోల్పోతామని తెలంగాణ బి.సి (ఎ) కులాల హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ. యం. బాగయ్య పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాదు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. బి.సి కులాల్లో అంతర్గత అసమానతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని, చిన్న జనాభా గల కులాలు రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడుతున్నాయని వివరించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన కొన్ని కులాలు అధిక అవకాశాలు పొందుతున్నాయని, దీనివల్ల బి.సి ‘ఏ’ కులాలకు నష్టం జరుగుతోందన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన కుల గణాంకాలు ఈ అసమానతలను స్పష్టంగా చూపుతున్నాయని, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రత్యేక రక్షణ అవసరమని సూచించారు. బి.సి ‘ఏ’ గ్రూపులో ముదిరాజ్ తదితర పెద్ద కులాలను చేర్చడం సరైంది కాదని, ఈ నిర్ణయాన్ని పునర్విచారించాలని డిమాండ్ చేశారు. బి.సి ‘ఏ’ కులాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, చిన్న కులాలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు యం.యస్. నరహరి, గౌరవ అధ్యక్షుడు గడప శ్రీహరి, కార్యనిర్వాహక అధ్యక్షులు డా. బయ్యా సాంబమూర్తి, గడప కోటేష్, కె.పి. మురళీకృష్ణ, ఎస్. వేంకటస్వామి, ప్రధాన కార్యదర్శి టి. నారాయణ, మహిళా కార్యదర్శి ఎ. దుర్గారాణి, కార్యదర్శులు డా. మురళీమోహన్, కోశాధికారి అంబటి సుధాకర్, నాయకులు ఎర్రబోయిన మల్లేష్, మూట గణేష్, గరిగ మల్లేష్, గాలి సత్యనారాయణ, డా. సాంబయ్య, అశ్వని చంద్రశేఖర్, సాగర్ నర్సంపేట్, రాజన్నల తిరుపతి, వినోద్ కుమార్, జి. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.