సమస్యల వలయంలో బస్తీలు
- చిన్నపాటి వర్షానికే జలమయంగా మారుతున్న కాలనీలు
విశ్వంభర, శంషాబాద్: శంషాబాద్ జోన్ కేంద్రంలోని వివిధ బస్తీల్లో మంగళవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. వర్షం జోరుగా కురియడంతో ఇంద్రారెడ్డినగర్ బస్తీ పక్కన ఉన్న రాళ్లగుట్ట పై నుంచి వచ్చిన వరద నీటిలో బురుద కలసి మొత్తం రోడ్లు, డ్రైనేజీల్లో నిండిపోయి డ్రైనేజీలు జాం అయ్యాయి. దానికి తోడు బస్తీ పక్కనే ఉన్న మైనార్టీ కాలేజీ భవనం ప్రహారీ గోడ బాగలేకపోవడంతో వర్షం నీరు ఆ ప్రహారీదాటి బస్తీలోకి ప్రవహించడంతో బస్తీలోని మట్టిరోడ్డుకోసుకుపోయి ఆ బుదరనీరు కూడ రావడంతో బస్తీలోని అన్ని రోడ్లు బురదమయ మయ్యాయి. కొందరు బస్తీవాసులు జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో జీహెచ్ఎంసీకి చెందిన ఓ వాహనం వచ్చి డ్రైనేజీలోని కొన్ని చోట్ల బురద తొలిగించడంతో కొంతమేరకు డ్రైనేజీ లో నీళ్లు పోతున్నాయి. అయితే చాల చోట్ల రోడ్లపై బురద అలాగే ఉండటంతో కనీసం నడవటానికి కూడ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుపుతూ కొందరు బస్తీవాసులు ఫోన్లో ఫోటోలు తీసి శంషాబాద్ జోన్ కమీషన్ చంద్రకళకు పంపినట్టు తెలిపిపారు. ఎప్పుడు వర్షం పడినా మైనార్టీ కళాశాల ప్రహారీలోని నీళ్లన్ని బస్తీలోకి వస్తాయని ఆ నీళ్లు బస్తీలోని కొన్ని ఇండ్లలోకి వెల్లడంతో పాటు రోడ్లలోకి రావడంతో దర్గంధబరితంగా మారుతున్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. బస్తీలో పేరుకు పోయిన బురదనీటిని తొలగించి తాగునీరు సరపఫరా పూర్తిగా నిలిచిపోయి కనీసం తాగడానికి మంచినీరు కూడ దొరకడంలేదన్నారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతానికి తాగు నీళ్లు వదిలే వాటర్ మెన్ ఉద్యోగానికి రాజీనామా చేశాడని దీంతో బస్తీవాసులకు తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది పట్టించుకొని బస్తీలో ట్యాంకర్ల ద్వార తాగునీరు సరఫరా చేయాలని బస్తీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఏమేరకు అధికారులు ఎప్పుడు స్పందిస్తారో, బస్తీవాసుల కష్టాలు ఎప్పుడు తీరుతాయోనని బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు.