అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి
- హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు ఆర్డీవో కు ఫిర్యాదు
విశ్వంభర , హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చాయని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు అయిలేని మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. అడ్మిషన్ల పేరుతో, టీసీల పేరుతో, పుస్తకాలు, యూనిఫాంల కొనుగోళ్ల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం మోపుతున్నారని అన్నారు. పాఠశాలల్లో సరైన ఆటస్థలాలు, పార్కింగ్ సదుపాయాలు కూడా లేకపోయినా అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హుస్నాబాద్‌లోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు సిండికేట్‌గా ఏర్పడి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. విద్యాశాఖ అధికారులు ఈ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పాఠశాల యాజమాన్యాలు మరింతగా రెచ్చిపోతున్నాయని, ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేకపోతే విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు యాస శ్రీనివాస్, కొమ్మెర నర్సింహారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.