స్నేహితుడి కుటుంబానికి అండగా ..
విశ్వంభర, రామన్నపేట: తమతో కలిసి మెలిసి తిరిగిన స్నేహితుడు అకస్మాత్తుగా మృతి చెందగా, అతని కుటుంబానికి అండగా మేమున్నామంటూ తోటి స్నేహితులు ముందుకొచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన గంగుల అమరేందర్ రెడ్డి గతవారం క్రితం మృతి చెందాడు. ఆపదలో ఉన్న అమరేందర్ రెడ్డి కుటుంబానికి స్నేహితులంతా కలిసి తమ వంతుగా ఆర్థికసాయం అందజేసి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. అమరేందర్ రెడ్డి గత వారం మరణించిన విషయం తెలుసుకొని నీర్నెముల ప్రాధమిక కొన్నత పాఠశాలలో 1999-2000 ఏడవ తరగతి బ్యాచ్ స్నేహితులంతా కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. పూర్వ విద్యార్థి మృతి చెందిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారా 1999-2000 ఏడవ తరగతి బ్యాచ్ మిత్రులకు సమాచారం చేరవేయగా, అందరూ కలిసి వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందజేసి వారి ఔదార్యాన్ని చాటుకున్నారు. మృతి చెందిన స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం ద్వారా తమ మానవత్వాన్ని చాటుకుంటూనే, మరోవైపు ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు నోముల శివ కుమార్, సుర్వి మల్లేష్, సుర్వి వీరేశం, నోముల లింగస్వామి, నెమనంది రమేష్, గంగుల నవీన్ రెడ్డి, శాంకొండ్ల శ్రవణ్, ఆవుల మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.