ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అడ్డుకున్న గంగాపురం గ్రామస్తులు
విశ్వంభర, గుండాల: “ప్రైవేట్ పాఠశాల వద్దు – ప్రభుత్వ పాఠశాల ముద్దు” నినాదంతో గంగాపురం గ్రామస్తులు, పంచాయతీ పాలకవర్గం కలిసి ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ను అడ్డుకుని ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాళీ మంజుల ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధారా సైదులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.