భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి
విశ్వంభర, భువనగిరి: భువనగిరి కోట అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి జూపల్లి కి ఘనంగా స్వాగతం పలికిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి , భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చారిత్రాత్మకమైన కోట భువనగిరి పర్యాటకుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యాటక కేంద్రం అభివృద్ధి చెందే విధంగా పనులు జరుగుతున్నాయి. మంత్రితో కలిసి భువనగిరి కోట రూమ్ పనులను పరిశీలించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉపాధి కూడా అభివృద్ధి చెందుతుందని తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పన జరుగుతుందని భువనగిరి నియోజకవర్గం అభివృద్ధికి పర్యాటక రంగం చేసే పనులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కాంట్రాక్టర్ అలసత్వం వహించ కుండా పనులను పూర్తి చేయాలని, అలనాటి కట్టడాల ను చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా పర్యాటకులు భువనగిరి కు వస్తారని తెలిపారు.