మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బూషి సంధ్యారెడ్డి నియామకం

 విశ్వంభర, బోడుప్పల్: భారతీయ జనతా పార్టీ మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా బూసి సంధ్యారెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సంధ్యారెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి, మహిళల సాధికారతకు,నారీ శక్తి అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా కృషి చేస్తానని,సమాజంలోని మహిళలు ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ రంగాలలో ముందుకు సాగేందుకు నిరంతరం సేవ చేస్తూ, పార్టీ ఆశయాల సాధనకు బాధ్యత పహిస్తానని, నిబద్ధతతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తానని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నాపై నమ్మకంతో మేడ్చల్ రూరల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా నియమించినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావుకి,మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి,  రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి,రాష్ట్ర నాయకత్వానికి మరియు జిల్లా నాయకత్వానికి బిజెపి కుటుంబ సభ్యులకు మహిళా నాయకులు, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/bushi-sandhya-reddy-appointed-as-mahila-morcha-president/article-17043

Tags: