గ్రామ పంచాయతీ సిబ్బందికి రక్షణగా వ్యక్తిగత ప్రమాద బీమా 

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, బోగారం గ్రామంలో గ్రామ ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, పారిశుధ్య నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది భద్రత కోసం బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ ఆయన 15 లక్షల ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా (యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్) చేయించారు. సోమవారం రోజు బోగారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సిబ్బందికి బీమా పత్రాలను సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, "ఎండనక, వాననక గ్రామ పారిశుధ్యం, నీటి సరఫరా, ఇతర అత్యవసర సేవల కోసం శ్రమిస్తున్న పంచాయతీ కార్మికుల ఆరోగ్య భద్రత, సంక్షేమం తమ బాధ్యత అని, విధి నిర్వహణలో వారికి ఎలాంటి అవాంఛనీయ ప్రమాదం జరిగినా, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థిక భరోసా కల్పించడానికే ఈ ప్రమాద బీమా చేయించడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్ యొక్క ఈ మానవతా దృక్పథంపై బోగారం గ్రామపంచాయతీ సిబ్బంది, కార్మికులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలిచి, ఈ బీమా సౌకర్యం కల్పించినందుకు సర్పంచ్ కూనూరు సాయి కుమార్ గౌడ్ కు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధా, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🕒 23 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/personal-accident-insurance-to-protect-gram-panchayat-staff/article-17003

Tags: