అగ్రిగోల్డ్ బాధితులకు ప్రత్యేక కమిటీ కై డిమాండ్
విశ్వంభర, ముషీరాబాదు: మూడు లక్షల మందికి పైగా బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీతో పాటు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాదు ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. ప్రభుత్వాలు మారినా సమస్యలు పరిష్కారం కాలేదని, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి మెమోరాండం ఇచ్చినా, ముఖ్యమంత్రిని కలిసినా పురోగతి కనిపించలేదని తెలిపారు. తెలంగాణలో అగ్రిగోల్డ్ బాధితుల్లో తీవ్ర నిరాశ నెలకొని పలువురు ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, అగ్రిగోల్డ్ కంపెనీ రియల్ ఎస్టేట్ పేరిట మోసాలకు పాల్పడిందని ఆరోపించారు. వెంచర్లలో భూములు కొనుగోలు చేసిన వారికి ఆస్తులను అటాచ్మెంట్ నుండి విడుదల చేసి యజమానులకు అప్పగించాలని కోరారు. బినామీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంపిణీ చేయాలని, సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. సమస్యలు పరిష్కారం కాకపోతే జూలైలో సెక్రటేరియట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో: జి వెంకటేశ్వరరావు కట్ల సతీష్ ఆనందు రజిత పద్మ సుగుణమ్మ సుజాత కృష్ణ నర్సింహ గణేష్ మల్లారెడ్డి జీవి రావు అమృతం సతీష్ శివనాగుల వెంకటరమణరావు ఆనంద్ సతీష్ శాంత హంసమ్మ పి సుగుణ ఏం యాదగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.