హనుమకొండ డీసీసీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
- ముఖ్య అతిథులుగా విచ్చేసిన టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షీ నటరాజన్
విశ్వంభర, హనుమకొండ : హనుమకొండ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ , ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం పూర్వ అధ్యక్షునికి ఘన సన్మానం కార్యక్రమం ప్రారంభంలో ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ అభివృద్ధికి సుదీర్ఘకాలం పాటు విశేష సేవలు అందించిన మాజీ డిసిసి అధ్యక్షులు, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ని శాలువా కప్పి, పూలమాలలతో అత్యంత ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. నియామక పత్రాల అందజేత - అధికారిక ప్రమాణ స్వీకారం అనంతరం నూతనంగా ఎంపికైన జిల్లా కార్యవర్గ సభ్యులకు, మండల అధ్యక్షులకు టిపిసిసి అధ్యక్షులు, ఎఐసిసి ఇంచార్జీ చేతుల మీదుగా అధికారిక నియామక పత్రాలను అందజేశారు. ఆ తర్వాత హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన బాధ్యతలు స్వీకరించిన సభ్యులందరితో క్రమశిక్షణ, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవ చేస్తామని అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ.. అధిష్టానం నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను ప్రతి ఒక్కరూ ఒక కర్తవ్యంగా భావించాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రభుత్వ సంక్షేమ, వినూత్న పథకాలను క్షేత్రస్థాయిలోకి, ప్రతి ఇంటి గుమ్మంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సరికొత్తగా ఏర్పాటైన ఈ నూతన బలమైన కమిటీ శ్రమించనుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే KR నాగరాజు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ లు రియాజ్, కుసురు పాషా, డీసీసీ అధ్యక్షులు అయూబ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు దుద్దిళ్ల శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాస్, భట్టి శ్రీనివాస్ రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ రావు లు పార్టీ ప్రజా ప్రతినిధులు, జిల్లా నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.