ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి

  • సర్పంచి డా.యాకాంతంగౌడ్

విశ్వంభర, నెల్లికుదురు: పొదుపు చేయడం, అవసరాల మేరకే ఖర్చు పెట్టడం, తెలివిగా పెట్టుబడులు పెట్టడం వంటి ఆర్థిక అక్షరాస్యతా అంశాలపై అవగాహన కలిగి ఉండాలని సర్పంచి డా.చిర్ర యకాంతంగా గౌడ్, డిసిసిబి నెల్లికుదురు బ్రాంచ్ మేనేజర్ తాడిశెట్టి శోభన్ గ్రామస్తులకు సూచించారు.నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో డీసీసీబీ నెల్లికుదురు బ్రాంచ్ ఆధ్వర్యంలో నాబార్డ్ వారి ఆర్థిక సహకారంతో సర్పంచి డా.యాకాంతం గౌడ్ అధ్యక్షతన ఆర్థిక అక్షరాస్యతపై మంగళవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాకారుడు వై.రమేష్ బృందం చే ప్రదర్శించిన నుక్కడ్ నాటకం ఆలోచింపచేసి అలరించింది. బ్రాంచ్ శోభన్ బ్యాంక్ ఖాతా, పొదుపు  ప్రాముఖ్యత, పి ఎం జె జె బి వై(ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన), పి ఎం ఎస్ బి వై (ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన), కేవైసీ, రీ-కేవైసీ,బ్యాంకు ద్వారా అందిస్తున్న వివిధ రకాల రుణ సౌకర్యాల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ కుర్మ మణిరత్నం,మెసెంజర్ రాపాక నవీన్, సిబ్బంది ఎడ్ల రమేష్,వార్డు సభ్యులు బొల్లు మురళి, బొమ్మనబోయిన స్వరూప,పిడుగు అనంత కార్యదర్శి ఎర్ర రవి, షేక్ అజీమ్,కారం ప్రశాంత్,శ్రీను,యాకయ్య, ఎల్లమ్మ, చిలకమ్మా, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/must-have-knowledge-of-financial-literacy/article-16440

Tags: