అక్కన్నపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బుర్ర ప్రభాకర్
విశ్వంభర, అక్కన్నపేట: హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షుల నియామకాలను పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అక్కన్నపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బుర్ర ప్రభాకర్‌ను నియమించడం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసిన కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. అక్కన్నపేట మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, గ్రామ స్థాయి నుంచి పార్టీ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో బుర్ర ప్రభాకర్ సమర్థవంతంగా పనిచేస్తారని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున పార్టీ అధిష్టానానికి, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు నూతన అధ్యక్షుడు బుర్ర ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.