అమరావతిలో నూతన క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి గౌస్ మోద్దిన్ 1లక్ష విరాళం
విశ్వంభర, అనంతపురం : హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 25 సంవత్సరాల సేవలను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించబోయే నూతన ఆసుపత్రి నిర్మాణానికి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఎన్‌బీకే ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు గౌస్ మొద్దీన్ రూ.1 లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని హిందూపురం ఎమ్మెల్యే , బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కి స్వయంగా అందించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, అభిమానులు సేవా కార్యక్రమాల్లో ముందుండి సమాజానికి అండగా నిలవడం అభినందనీయమని, భవిష్యత్తులో కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ తరఫున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం అభిమానుల్లో సేవా స్పూర్తిని మరింత పెంపొందించేలా నిలిచిందని నాయకులు పేర్కొన్నారు.