జిల్లా సరిహద్దులో భద్రత కట్టుదిట్టం చేయాలి

  • అనంతగిరి  స్టేషన్ ను తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహా 

విశ్వంభర, అనంతగిరి: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల తనిఖీలలో భాగంగా మంగళవారం అనంతగిరి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ నర్సింహా  తనిఖీ చేశారు. ఎస్పీ , డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి , ఎస్ఐ నవీన్ కుమార్ గౌరవ వందనంతో స్వాగతం తెలిపారు. అనంతరం  పోలీసు సిబ్బంది నిర్వహించిన కవాతుని పరిశీలించి పోలీసు సిబ్బంది పరికరాలను ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ లో  నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డ్ లను పరిశీలించారు. స్టేషన్ నిర్వహణ రిసెప్షన్ సెంటర్ నిర్వహణ ఫిర్యాదుల నిర్వహణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రతి ఫిర్యాదుదారుడికి భరోసా కల్పించడం వారికి రక్షణ కల్పించడం పోలీసు ప్రధమ విది అని అన్నారు, మహిళా భద్రతకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా సంబంధిత ఫిర్యాదులకు  ఆలస్యం చేయకుండా వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అనంతగిరి మండలం ఆంధ్ర , ఖమ్మం జిల్లా బార్డర్ కలిగి ఉందనీ అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణా ను అరికట్టడంలో నిరంతరం నిఘా ఉంచి పటిష్టంగా కృషి చేయాలి సూచించారు. కేసులు పెండింగ్ లేకుండా దర్యాప్తు చేయాలని కోర్టులతో సమన్వయం చేసి ఎక్కువ కేసుల్లో నేరస్థులకు శిక్షలు పడేలా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాజిక అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ సైబర్ మోసాల నివారణ, రోడ్డు ప్రమాదాల నిర్మూలన, డ్రగ్స్ రహిత సమాజ స్థాపన కోసం ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, ఇన్చార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ మగ్దూం అలీ, ఎస్సై నవీన్ కుమార్, స్టోర్ ఇన్చార్జి ఎస్ఐ అఖిల్, డిసిఆర్బి ఏఎస్ఐ అంజన్ రెడ్డి, ఎస్పి సిసి జూనియర్ అసిస్టెంట్ సందీప్, ఐటి కోర్ట్ కానిస్టేబుల్ సుమన్ పాల్గొన్నారు.

🕒 24 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/security-should-be-tightened-at-the-district-border/article-17049

Tags: